భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్న రాజాపేట గణనాథుని పూజలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణనాథునికి బుధవారం ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ ట్రస్టు అభివృద్ధి సేవా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగాయి. ప్రధాన అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద శర్మ చర ప్రతిష్ట వినాయకుడికి గణపతి అర్చనలు నిర్వహించారు. పూజల్లో బెజుగం శ్రీనివాసులు సరిత పుణ్య దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళహారతులతో స్వామివారిని కొలవగా ఆర్యవైశ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు.