యూట్యూబర్ మధుమిత ఇంట్లో చోరీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Kanyakumari
ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో మధుమిత పెట్టిన పోస్టులను చూసి ఆకర్షితులై దొంగతనం చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఆమె ఇంట్లో 118 సవర్ల బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు చోరీకి గురయ్యాయని రాజక్కమంగళం పోలీసులు వెల్లడించారు.