ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన: షెడ్యూల్పై స్పష్టతనిచ్చిన ఈవో
రిపోర్టర్: గోపి
స్థలం: Vijayawada
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన షెడ్యూల్, ఆలయ మహానివేదన సమయాలపై వస్తున్న వదంతులపై దుర్గగుడి ఈవో స్పష్టతనిచ్చారు. రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ, పోలీసులు, జిల్లా యంత్రాంతో ప్రాథమిక సమన్వయం జరుగుతోందని, ఆగమ విధానాలకు అనుగుణంగానే అన్ని కార్యక్రమాలు, దర్శనాలు జరుగుతాయని ఈవో స్పష్టం చేశారు.