1984 అల్లర్లపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని హర్దీప్ సింగ్ పూరి డిమాండ్

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

దేశ రాజధాని న్యూఢిల్లీలో 1984 నాటి సిక్ కు వ్యతిరేక అల్లర్లపై కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి డిమాండ్ చేశారు. పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ లో బీజేపీ చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనకు ఆయన నాయకత్వం వహించారు. ఈ దాడులు యాదృచ్ఛికంగా జరిగినవి కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాగిన నరమేథం అని హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేసినట్లు పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది.