నెల్లూరు జిల్లాలో రూ.380 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ సహకారంతో సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళతామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మైపాడుగేటు సెంటరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి, నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హైబ్రిడ్‌ మాన్యుటీ మోడల్‌ పథకం ద్వారా రూ.380 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 62 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ సుజాత, కమిషనర్‌ నందన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.