భారీ వర్షాల అంచనా నేపథ్యంలో కలెక్టర్లను అప్రమత్తం చేసిన చంద్రబాబు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో భారీ వర్షాల అంచనా నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించి, నదులు, వాగుల్లో వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.