నిర్మల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటవుతున్న భారీ షాపింగ్ మాల్స్

రిపోర్టర్: అశోక్ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లా కేంద్రంలో రాబోయే దసరా పండుగ నాటికి ప్రారంభం కానున్న బడా వస్త్ర వ్యాపార మాల్స్‌కు కనీస నిబంధనలు పాటించకుండానే మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చేశారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సెట్‌బ్యాక్, పార్కింగ్ స్థలాలు లేకుండానే ప్రధాన రహదారిపై ఈ మాల్స్ ఏర్పాటవుతుండడంతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, అగ్నిమాపక భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమవుతోందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.