హైదరాబాద్ లో ఓటరు జాబితా కలకలం: అక్రమంగా విదేశీయుల పేర్లు నమోదు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా కొందరు విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లుగా నమోదైనట్లు అధికార వర్గాలు గుర్తించాయని, సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నేపాల్ కు చెందిన పన్నెండు మంది ఎలాంటి వీసా లేదా పౌరసత్వం లేకుండానే ఓటు హక్ కు పొందినట్లు అధికారులు తేల్చారని, రంగారెడ్డి జిల్లాలో రోహింగ్యాలు సైతం అక్రమంగా చేరినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.