కోలీవుడ్ కు తీపి కబురు: ఆరు షోలకు అనుమతిచ్చిన సీఎం విజయ్

రిపోర్టర్: హరి స్థలం: చెన్నై

తమిళనాడులో సినిమా థియేటర్లలో అదనపు షోలకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు రోజుకు ఆరు ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు సినిమాలను ప్రదర్శించుకోవడానికి అవకాశం కల్పించారు. గతంలో ఉన్న నిబంధనలను సడలించడంతో సినీ పరిశ్రమ వర్గాల్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.