శాత్రాజుపల్లిలో అర్ధరాత్రి భారీ కూల్చివేతలు: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లు నేలమట్టం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మల్హర్ రావు

మల్హర్రావు మండలం తాడిచెర్ల పరిధిలోని శాత్రాజుపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలతో అధికారులు మూడు వందలకు పైగా ఇళ్లను నేలమట్టం చేశారు. శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి జేసీబీలతో ఈ కూల్చివేతలు చేపట్టారు. అసైన్డ్ భూముల్లో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.