విచారణ సమయంలో పెన్‌డ్రైవ్ సాక్ష్యం తిరస్కరించిన ఒరిస్సా హైకోర్టు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
బాధిత మహిళ సమర్పించిన పెన్‌డ్రైవ్ రికార్డింగ్‌లను విచారణ సమయంలో సాక్ష్యంగా అనుమతించలేమని ఒరిస్సా హైకోర్టు స్పష్టం చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. ఛార్జ్ షీట్లో లేని మెటీరియల్‌ను ట్రయల్ కోర్టు ముందు ఉంచడానికి వీలులేదని, నిందితుడి హక్కులను విస్మరించలేమని జస్టిస్ వి నరసింగ్ ధర్మాసనం పేర్కొంది. క్రిమినల్ ట్రయల్‌లో నేరం రాష్ట్రానికి వ్యతిరేకంగా జరుగుతుందని, విచారణా సంస్థ సేకరించని ఆధారాలను బాధితురాలి అభ్యర్థన మేరకు అంగీకరించలేమని కోర్టు తేల్చిచెప్పింది.