విజయనగరం జిల్లా: జొన్నవలసలో శ్రీ పైడితల్లి అమ్మవారి వృక్షాలకు ప్రత్యేక పూజలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా జొన్నవలసలో శనివారం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వృక్షాలకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల పన్నెండో తేదీన జొన్నవలసలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారి శిరీష, పూజారి బంటుపల్లి వెంకట్రావులు తెలిపారు. ఆ తర్వాత వాటిని విజయనగరం జిల్లా కేంద్రంలోని హుకుంపేటకు తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు.