కృత్రిమ బియ్యం కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

ఎల్ ని నో సాకుతో బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై టాస్క్ ఫోర్స్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్యుల రక్తాన్ని పిండేలా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేస్తున్న స్వార్థపరుల దోపిడీని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు.