ప్రశ్న రావణ్ కేసులో దర్యాప్తునకు మరో ముప్పై రోజులు పొడిగింపు

రిపోర్టర్: గోపి స్థలం: మచిలీపట్నం

యుట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు పోలీసులకు మచిలీపట్నం జిల్లా కోర్టు మరో ముప్పై రోజుల అదనపు గడువు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని గన్నవరం పోలీసులు కోరడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని ఈ మేరకు తీర్పు వెలువరించారు. గతంలో సీఎం, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం.