గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబర్ ముప్పై లోపు ఈకేవైసీ తప్పనిసరి

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

ఎల్పీజీ వినియోగదారులు సెప్టెంబర్ ముప్పై లోపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని, లేకపోతే అక్టోబర్ ఒకటి నుంచి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో చాలా మంది ఇంకా ఈ ప్రాసెస్ పూర్తి చేయకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీ పెరిగింది. మహాలక్ష్మి మరియు దీపం పథకం లబ్ధిదారులు కూడా వేలిముద్రలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు స్పష్టం చేశారు. ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయని వారికి సబ్సిడీ సిలిండర్ల బుకింగ్స్ ఆగిపోతాయని వెల్లడించారు.