వరి విత్తనాల కొనుగోలుకు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధనలను ఎత్తివేసిన వ్యవసాయ శాఖ

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

కవ్వాల్ క్లస్టర్ పరిధిలో వరి విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం లేదని వ్యవసాయ శాఖ క్లస్టర్ అధికారి అఖిల్ బాదావత్ వెల్లడించారు. విత్తనాల కొనుగోలుకు సంబంధించిన నిబంధనలు అవసరమైన వివరాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియో విడుదల చేసినట్లు చెప్పారు. రైతులు అనవసర ఆందోళనకు గురికాకుండా వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు పాటించాలని కోరారు.