నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Andhra Pradesh
నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాన్యులపై భారం తగ్గించేందుకు కిలో ఉల్లిని రూ.35కే అందించాలని నిర్ణయించింది. అలాగే, 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులను కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. పామాయిల్‌ను కూడా సబ్సిడీ ధరలకే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.