ఐఐటీ జామ్ 2027 రిజిస్ట్రేషన్లు రేపటి నుంచే ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
ఐఐటీ ఖరగ్పూర్ ప్రతిష్టాత్మక ఐఐటీ జామ్ 2027 ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్లను సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభించనుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 12 దరఖాస్తుకు చివరి తేదీ కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రెండు విడతలుగా ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది.