పుంగనూరులో ఉద్రిక్తత: ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: పుంగనూరు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పుంగనూరులో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరో యాభై మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించి, బారికేడ్లను ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెట్టారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి, గాల్లోకి కాల్పులు జరిపారు.