నెల్లూరు జిల్లాలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎండీఎంఏ అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వెంకటాచలం-సత్రం పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహించి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణాపై పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు.