తెలంగాణ ఆడపడుచుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: సిద్దిపేట
మన పూల పండుగ మన తెలంగాణ సంస్కృతి అయిన సద్దుల బతుకమ్మ సంబరాలను తెలంగాణ ఆడపడుచుల ఆనందోత్సాహాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించుకున్నట్లు పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ వేడుకలు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ ప్రజలందరిలోనూ నూతనోత్సాహాన్ని నింపాయని తెలిపారు. సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలతో కలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు.