సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కేజేఆర్ గార్డెన్ కూల్చివేత: దశాబ్దాల వివాదానికి తెర
రిపోర్టర్: శివ
స్థలం: సికింద్రాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో వివాదాస్పదంగా మారిన కేజేఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌ను కోర్టు ఆదేశాల మేరకు బోర్డు అధికారులు శుక్రవారం పూర్తిగా నేలమట్టం చేసినట్లు కంటోన్మెంట్ వర్గాలు తెలిపాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ అక్రమ కట్టడంపై సుదీర్ఘకాలం సాగిన న్యాయపోరాటంలో అధికారులకు అనుకూలంగా తీర్పు రావడంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేత ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.