భారీ ఊరట: చేయూత పింఛనుదారుల భార్యలకు తక్షణమే పింఛను మంజూరు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛనుదారులకు శుభవార్తను అందజేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చేయూత పింఛను అందుకుంటున్న భర్త మరణిస్తే, భార్యకు పింఛను మంజూరయ్యే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భర్త మరణించిన సమయానికి భార్య వయస్సు ఆధారంగా పింఛను రకం మారుతుందని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల భర్తను కోల్పోయిన మహిళలకు తక్షణ ఆర్థిక భరోసా లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.