ఎనిమిదో ఆసియా కప్ కోసం భారత్ శ్రీలంక ఫైనల్ పోరు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న ఉత్కంఠభరితమైన మహిళల ఆసియా కప్ తుది పోరులో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఏడుసార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ సేన, ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఎనిమిదో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకోవాలని సర్వసన్నద్ధమైంది. లీగ్ దశ నుంచి అప్రతిహత విజయాలతో దూసుకొచ్చిన టీమిండియా ఫైనల్లోనూ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.