అంగన్వాడీ ఉత్సవ కన్వీనర్‌గా కమ్మరి పద్మావతి నియామకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎమ్మిగనూరు
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాలకు ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మరియు మంత్రాలయం మండలాల కన్వీనర్‌గా కమ్మరి పద్మావతిని నియమించారు. ఈ బాధ్యతను తనకు అప్పగించిన రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మహిళా మోర్చా కార్యక్రమాల విజయానికి తనవంతు కృషి చేస్తానని పద్మావతి పేర్కొన్నారు.