సెప్టెంబర్ 10న నీట్ పీజీ ఆన్సర్ కీ విడుదల కానుంది

రిపోర్టర్: గోపి స్థలం: India

నీట్ పీజీ 2026 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబర్ 10న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేయనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకతలో భాగంగా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in ద్వారా లాగిన్ అయ్యి తమ సమాధానాలను సరిచూసుకోవచ్చు. పరీక్షా ఫలితాల ప్రక్రియలో ఇది కీలకమైన అడుగు.