నాతవరంలో కూటమి ఎంపీటీసీ సీట్ల సర్దుబాటు పూర్తి చేసి దూకుడు పెంచిన నేతలు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాతవరం
అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఎంపీటీసీ స్థానాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ తెలిపారు. మండలంలోని మొత్తం పద్దెనిమిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పదహారు, జనసేన పార్టీ రెండు చోట్ల పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు అందరూ ఐక్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.