సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన విజయ్ రష్మిక టీమ్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ ప్రముఖ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారంపై వారి మేనేజ్మెంట్ టీమ్ తీవ్రంగా స్పందించింది. వీరిద్దరిపై కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ట్రెండ్స్ సృష్టిస్తున్నాయంటూ ఆరోపిస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందజేసినట్లు వారి ప్రతినిధులు తెలిపారు. తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వారిపై చట్టపరంగా ఎంతవరకైనా వెళతామని వారు హెచ్చరించారు.