వియత్నాంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏపీ యువకుడు దుర్మరణం

రిపోర్టర్: రాజేష్ స్థలం: బాపట్ల

వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన సందెపూడి సాల్మన్ రాజు(35) మృతి చెందాడు. ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం వియత్నాం వెళ్లిన సాల్మన్ రాజు మరణవార్తతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శనివారానికి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.