అక్టోబర్ 2న భారీ స్థాయిలో ‘అనకాపల్లి’ సినిమా విడుదల!
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అనకాపల్లి
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకాలపై తెరకెక్కిన రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ భారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.