గూడూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గాంధీనగర్‌లో స్థలాల కేటాయింపు నుంచి స్టేడియం అభివృద్ధి వరకు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.