రెండవ విడత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి: ఎస్టీయూ డిమాండ్
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కె. లక్ష్మీనారాయణను ఎస్టీయూ జిల్లా నాయకులు కలిశారు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను రెండవ విడత ద్వారా వెంటనే భర్తీ చేయాలని వినతి పత్రం సమర్పించారు.
దీనిపై స్పందించిన డీఈవో, మొదటి విడత నియామకాలు తుది దశలో ఉన్నాయని, మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ రెడ్డి, గంటా మోహన్, పురుషోత్తం పాల్గొన్నారు.