40 మంది ఉపాధ్యాయుల జీతాల సమస్య పరిష్కారానికి చర్యలు

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో డెప్లాయ్ మెంట్ ద్వారా నియామకం పొందిన 40 మంది పీజీ టీచర్ల పెండింగ్ జీతాల సమస్యను ఎస్టీయూ నాయకులు డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డీఈవో స్పందిస్తూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో చర్చించామని తెలిపారు.

రాష్ట్ర ఖజానా కార్యాలయానికి తగిన వివరాలతో లేఖ పంపామని, త్వరలోనే ఉపాధ్యాయుల వేతనాల సమస్య పరిష్కారం అవుతుందని డీఈవో భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు అమర్ తదితరులు పాల్గొన్నారు.