చీరాల మున్సిపల్ ఎన్నికల్ లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ

రిపోర్టర్: సునీల్ స్థలం: చీరాల

చీరాల మున్సిపాలిటీ ఇరవై ఐదో వార్డు ఉప ఎన్నిక కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రావు ఘన విజయం సాధించారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. తుఫాన్ ప్రభావంతో వాయిదా పడిన ఈ ఎన్నికల ఫలితాల్ లో హస్తం పార్టీ సత్తా చాటిందని, బీజేపీ రెండో స్థానంలో నిలవగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని స్థానికులు స్పష్టం చేశారు. ఈ గెలుపు వెనుక సీనియర్ నేత ఆమంచి కృష్ణ మోహన్ ప్రభావం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.