మల్లెల గూడెంలో ఉత్సాహంగా సాగిన పోషకాహార వారోత్సవాలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని మల్లెగూడెం అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషకాహార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సర్పంచ్ జెన్నెపల్లి బాలరాజు రెడ్డి, ఉపసర్పంచ్ రెడ్డబోయిన కవిత రాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణ పాల్గొని తల్లులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.