నెల్లూరులో టీడీపీలోకి భారీ చేరికలు: కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వాసం

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం వెంగంపల్లి గ్రామానికి చెందిన యాభై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నెల్లూరులోని తన నివాసంలో సానా నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు ఘనంగా జరిగాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పాలనను చూసి ప్రజల్లో ప్రభుత్వాలపై విశ్వాసం పెరుగుతోందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.