'ఫ్రస్టేషన్‌లో ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారు': రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో పడి ప్రతిపక్షాలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని, దాడులు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేత తీవ్రంగా మండిపడ్డారు. మొన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లోనే దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను, పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.