ఆర్మీ ఉద్యోగి రవి అదృశ్యంపై వీడని అనుమానాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరికుంటపాడు

వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగి పగడాల రవి 64 రోజులుగా కనిపించకుండా పోవడంతో అతని ఆచూకీపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు నుంచి రవి ఐడెంటిటీ, ఆధార్, ఏటీఎం కార్డులతో పాటు ఫొటోలు రిజిస్టర్ పోస్టు ద్వారా కుటుంబ సభ్యులకు అందడం కలకలం రేపింది. భర్త జాడ తెలియక భార్య వరలక్ష్మి, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, ఉన్నతాధికారులు స్పందించి ఈ రహస్యాన్ని చేధించాలని డిమాండ్ చేస్తున్నారు.