అధిక ధరలకు బియ్యం అమ్మితే పీడీ యాక్ట్ తప్పదన్న జేసీ

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లాలో బియ్యం వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్న వైనంపై యంత్రాంగం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించే వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.