అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయనున్న ఇరవై ప్రత్యేక బృందాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. తొలి విడతలో ముప్పై ఐదు వేల మందికి పైగా బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల గుర్తింపునకు ఇరవై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బాధితులు తమ ఒరిజినల్ పత్రాలను అధికారులకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.