తెలుగులో రానున్న సంచలన భక్తిరస చిత్రం 'హనుమాన్ అంశ్'

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాధారంగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు సాధించిన సంచలన హిందీ చిత్రం 'హనుమాన్ అంశ్' తెలుగులోకి వస్తోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న భారీ స్థాయిలో విడుదల కానుంది.