వరంగల్ గడ్డపై కవిత తెలంగాణ రక్షణ సేన సమరశంఖం
రిపోర్టర్: రాము
స్థలం: వరంగల్
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పార్టీగా అవతరించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) తొలి సమరానికి వరంగల్‌ను వేదికగా ఎంచుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలోనూ తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని కవిత స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ విద్యార్థులతో కలిసి హనుమకొండలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.