పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజ స్థాపన సాధ్యమని ఎమ్మెల్యే అదితి పిలుపు

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం రూరల్ పరిధిలోని జమ్ము కోమటి చెరువు వద్ద నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొని చెరువు పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన ప్రాంతాలను మనమే అభివృద్ధి చేసుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల ఆరోగ్యం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలస్వామి, నాయకులు గంటా రవి, కంది మురళి నాయుడు, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.