ధన్వాడకు రేపు విచ్చేయనున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి సచ్చిదానంద స్వామీజీ
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా ధన్వాడ గ్రామానికి ఆదివారం అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విచ్చేయనున్నారు. ఉదయం పది గంటలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామానికి చేరుకుని, దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని భక్తులకు దివ్య భాషణం అందించనున్నారు. అనంతరం మంథనిలో భక్తులకు దర్శనమిచ్చి ప్రసంగించనున్నారు.