విద్యార్థులకు గుడ్ న్యూస్: ఏపీ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ గడువు పెంపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏపీ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. అర్హత గల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుల ద్వారా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ స్కాలర్షిప్ ఎంపిక కోసం నిర్వహించే రాత పరీక్ష వచ్చే నెల ఇరవై తొమ్మిదో తేదీన జరగనుందని స్పష్టం చేశారు.