డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పై జాన్ ఒసాఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Georgia

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన సన్నిహితులపై సెనేటర్ జాన్ ఒసాఫ్ జార్జియాలో జరిగిన భారీ బహిరంగ సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ హయాంలో రాజకీయ అవినీతి తారాస్థాయికి చేరిందని, ప్రజా ప్రయోజనాలను గాలికొదిలేసి వ్యక్తిగత సంపాదనపైనే దృష్టి పెట్టారని ఆయన మండిపడ్డారు. ట్రంప్ అనుచర వర్గాన్ని ఆయన మారా-లాగో మాఫియాతో పోల్చారు.