కన్నతల్లి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటిన వెంకటాచలం బిడ్డలు
రిపోర్టర్: సాయి దివ్య
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామానికి చెందిన నాసిన శేషమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సమాచారం అందుకున్న శివాజీ యూత్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వెంపులూరు హరి సకాలంలో అందించిన ప్రేరణతో ఆమె కుమారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు తల్లి నేత్రాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మరణానంతరం ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేత్రదానం ఎంతో మిన్న అని స్థానికులు శేషమ్మ కుమారుల అభినందనీయ నిర్ణయాన్ని కొనియాడారు.