తీవ్ర తుఫాను ముప్పు: ఏన్కూర్ - ఖమ్మం రహదారి మూసివేత
రిపోర్టర్: నరేష్
స్థలం: ఏన్కూర్
తుఫాను ప్రభావం కారణంగా జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఏన్కూర్ ఎస్సై సంధ్య విజ్ఞప్తి చేశారు. అంజనాపురం సమీపంలో పెద్దవాగు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రమాదాల నివారణ కోసం ఏన్కూరు నుండి ఖమ్మం వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశామని ఆమె తెలిపారు. వాహనదారులు అటువైపు ప్రయాణించవద్దని, పోలీసుల సూచనలు పాటించాలని ఎస్సై సంధ్య స్పష్టం చేశారు.