సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు ప్రేమనే ఊరిలో సినిమా
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన ప్రేమనే ఊరిలో చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల జరిగిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.