అమెరికాలో ప్రవాస తెలుగు సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ఘనంగా ఆరోగ్య మేళా

రిపోర్టర్: శివ స్థలం: Charlotte

అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లెట్ ఏరియా ఆధ్వర్యంలో ఆరోగ్య మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రవాస తెలుగు ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో పలువురు నిపుణులైన వైద్యులు సేవలు అందించారు. ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే మొదటి విడత శిబిరానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు.